Economics play vital role in choosing a launguage of communication and education. People are opting for English medium since it gives them opportunity for a better grip of English and leading to a good job. For any body stomach is first and art is next. In this scenario how can we blame people who are after English. English is O.K.. but simaltaneously efforts to serve mother tongue Telugu is a vital need to save and enhance it.
On 7/19/06, Murali Krishna <
pmkrishna79@gmail.com> wrote:
> కిరణ్ గారు,
>
> -- మీ రచన చాలాబాగుంది.
>
> ఒక భాష మరుగున పడటానికి గల
> కారణాలు బాగా వివరించారు.
>
> ఐతే ప్రస్తుతం ఇంగ్లిష్
> గుత్తాదిపత్యానికి
> గలకారణాలు ఇంకా కొన్ని..
>
> ఒకటి.
> --మొదటి కారణం మనమే.
>
> మనకి మనభాష మీద గౌరవం లేదు.
> ఏదయినా సందర్భంలో అందరి
> మధ్యతలుగులో మాట్లాడితే
> తక్కువగా చూస్తారని భయం.
> మనం అచ్చ తెలుగులో
> మాట్లాడితే
>
> జనం వింతగా
> చూస్తారు.వీడికి ఇంగ్లిష్
> రాదుకాబోలు అనుకుంటారు. మన
> భాషా పరిజ్ఞానం వారికి
> గొప్పగా కనపడదు. కారణం
> వారికి అర్ధం
>
> కాకపోవటమే. అదే ఏదైన
> అర్ధంకాని ఇంగ్లిష్ ముక్క
> మాట్లాడండి "అబ్బో వీడికి
> 'Communcation Skills' ఎంతబాగావచ్చో"
> అనుకుంటారు.
>
> రెండు.
> -- ఇంగ్లిష్ వస్తే Communcation Skills
> (నలుగురిలో మాట్లాడగలగటం)
> వచ్చినట్లంట.
>
> అసలు 'Communication skills' కి 'నలుగురిలో
> మాట్లాడగలగటం' కి పోలిక
> లేదు.
> 'Communication skills' అంటే భావాన్ని
> చక్కగా వ్యక్త పరచగల కళ.
> మనం చెప్పాలనుకున్నది
> ఏభాషలోనైనా చక్కగా
> తెలియచేయవచ్చు.ఇంగ్లిష్
> వస్తే 'Communication Skills'
> వచ్చినట్లుకాదు.
> భావవ్యక్తీకరణ కళ
>
> మనలో వుండాలి. మనం ఏభాషలో
> మాట్లాడాలనుకున్నామో అది
> తెలిసి వుండాలి. ఆ భాష తలియక
> పోవడం నేరంకాదు. అంటే మీకు
> ఇంగ్లిష్ రాకపోతే
>
> మీరసలు భావాన్నే
> వ్యక్తపరచలేరనికాదు. మీరు
> చెప్పాలనుకున్న విషయం మీద
> మీకు పట్టు ఉంటే మీరు మీ
> మాత్రు భాషలో అదరకొడతారు.
> మనదికాని
>
> భాషలో మాట్లాడితే కొంచెం
> గర్వంగానే వంటుంది.
> ఉదాహరణకు
> నేను తమిళ్ లో మాట్లాడితే
> ఇక్కడి వారు "నీకు తమిళ్
> వచ్చా?" అని గొప్పగా
> చూస్తారు. ఐనంత మాత్రాన
> తమిళ్ గరించి మనం
> తన్నుకులాడం.
>
> వాడికి అర్ధంకాక పోతే
> అదివాడి ఖర్మ, వాడే అర్ధం
> చేసుకొంటాడు అనుకుంటాం.
> ఇంగ్లిష్ విషయంలో అలా
> ఉండలేం. ఇంగ్లిష్ రాకపోతే
> ఏంటటా? అని
>
> మీ నన్నగారిని అడగండి, "ఏం
> అడుక్కు తినిబతకాలనుందా?"
> అని వెంటనీ జవాబు వస్తుంది.
> దీనికి కారణం మన ఆర్ధిక
> స్థితి.
>
> మూడు
> -- మన ఆర్ధిక స్థితి.
>
> మన అంటే మన కటుంబానిది కాదు.
> మన దేశ ఆర్ధిక స్థితి.
> ఇంగ్లిష్ గురించి మనం
> పాకులాడే ఇంగ్లిష్ వారే
> మనల్ని కొల్లగొట్టారు.
> "ఐతేనేం
>
> మనకి ఇంగ్లిష్ ఇచ్చారు, business
> నేర్పించారు, మనకి culture అంటే
> ఏంటో చూపించారు" అని
> వాదించేవారు లేకపోలేదు.
> అలా అంటే నాకు చాలా
>
> కోపమొస్తుంది.
> అలాగే నవ్వుకూడా వస్తుంది.
>
> కళలకు, సంస్కౄతి,
> సాంప్రదయాలకు నిలయమైన మనకా
> ఒకరు నేర్పేది? అలావారు
> మాట్లాడటానికి గలకారణాలు
> లేకపోలేదు.
>
> మీకు క్రీస్తు కధ తలిసే
> వుంటుంది. (మనం హిందువులం.
> మనకు అన్ని మతాలు సమానమే.
> మంచినికోరే వారందరూ భగవత్
> స్వరూపులే)
>
> సరే క్రీస్తు కధలో ఏమైంది?
> ఆయనను బంధించేటప్పడు తన
> శిష్యులు ప్రాణాలు అరచేత
> పట్టుకొని
> చెల్లాచెదురవుతారు. అందులో
> ఒకడు క్రీస్తు
>
> ఎవరో తనకు తలియదంటాడు.
> అంతకాలం వారికి జీవితాన్ని
> ప్రసాదించిన భగవంతుడు కంటే
> వారికి వారి ప్రాణం
> ఎక్కువయ్యింది. మనుషులు
> వారి
>
> అవసార్ధం భగవంతుడనే
> విశ్మరిస్తారనటానికి ఇది
> ఒక మంచి ఉదాహరణ. ఇంక మనకి
> దేశం ఎంత తక్కువ?
>
> మన దేశం గురించి మన వాళ్ళు
> తక్కువగా మాట్లాడటానికి గల
> కారణం ఇదే.
> మన ఆర్ధికస్థితి
> సరిగ్గాలేనపుడు వలసలు
> పోవటం మామూలే. వలస పోయాక పేద
> స్థితిని ఎవరు
> తలచుకుంటారు?
>
> ఒకప్పుడు మనం గొప్ప
> వాళ్లామా పేదవాళ్లమా అనేది
> నలుగురికి అనవసరం. మనం
> ఇప్పుడు ఎలాఉన్నాం అనేదే
> వారికి ముఖ్యం.
>
> మన దేశ ఆర్ధిక స్థితి
> మెరుగు పడటానికి మనమంతా
> కష్టపడాలి. మన దేశ
> భవిష్యత్తు
> రాజకీయనాయకులమీద లేదు. మన
> మీదే ఉంది. మన ఆర్ధిక స్థితి
>
>
> బాగున్నప్పుడు మనం వలస
> పోము. మన దగ్గరకే ప్రపంచం
> వస్తుంది.
>
> నాకో కల ఉంది.
>
> పాశ్చాత్య దేశాలకు
> వెళ్ళటానికి మనం TOEFL, GRE అంటూ
> రాస్తుంటాం.
> ఒక రోజు వాళ్ళే మన దేశానికి
> రావటానికి ప్రవేశ పరీక్క్ష
> రాయాలి. అందుకు మన ఆర్దిక
> స్థితి మెరుగు పడాలి.
>
> ఇలానాకు తెలిసినవి రాశాను,
>
> -- మురళి కృష్ణ.
>
> Kiran Kumar Chava wrote:
> > This is something I have written for asking print media to publish.
> >
> > Coult not get enought time and enthu for making it better and for sending
> > for publishing..
> >
> > Will be happy, if somebody finds interest on this
> >
> > neverthless you are welcome to send comments...
> >
> >
> >
> > *ఆధునిక** **లోగిళ్ళలో** **తెలుగు భాష*
> >
> > *కిరణ్** **కుమార్** **చావా*
> >
> > ప్రజలకు జ్ఞానాన్ని పంచి ఇవ్వడంలోనూ, ప్రజలను దగ్గరకు చేయడంలోనూ, ప్రజలను దూరం
> > చేయడంలోనూ, యుద్దాలకు, సైద్దాంత రాద్దాంతాలకూ మూల స్థానంలో నిలిచిన సంధర్బాలు
> > చరిత్రలో పెక్కు కలవు. భాషలు అకస్మాత్తుగా మృతి చెందిన సంధర్బాలూ, క్రమక్రమంగా
> > మృతిచెందిన సంధర్బాలూ, క్రొత్త బాషలు జన్మించిన సంధర్బాలూ, రెండు మూడు బాషలు
> > కలిసిపొయిన సంధర్బాలూ చరిత్రలో అనేకము కలవు. కాకపోతే గతంలో భాషలు మరణించడానికి
> > యుద్దంలో ఆ భాషమాట్లాడే వారు ఓడిపోవడం ప్రధాన కారణంగా ఉండేది. ఈజిప్టియను
> > భాషలయినా, సుమేరియన్ భాషలయినా, పార్శీ - యూరోపు దేశాల భాషల జననాలు - మార్పులు
> > చూసినా ఈ దండ యాత్రలు, యుద్దాలు రక్తపాతాలు, విజయాలు - అపజయాలూ నియంతృత్వాలు
> > ప్రధాన కారణంగా కంపిస్తాయి.
> >
> >
> > కానీ, అంతకంటే భయంకరమైన - రక్తపాత రహితమైన మార్పు ప్రస్తుత ప్రపంచ భాషలలో
> > రాబోతుందని ఓ వర్గం మేదావుల ఆందోళన. ఈ ఆందోళనకు ప్రధాన కారణం సాంకేతిక-ఆర్థిక
> > రంగాలలో ఇంగ్లీషు భాష యొక్క తిరుగులేని ఆధిఖ్యత! ఇప్పటికే ప్రపంచంలోని చాలా
> > చిన్న భాషలు మ్యూజియంలకూ, భాషాకారుల పుస్తకాలకూ పరిమితమైనాయి. ఇంకా మధ్యస్థాయి
> > భాషలు మృతికి దగ్గరగా - తెలుగు వంటి భాషలు ఎటు ప్రయాణించాలో తెల్సుకోలేని
> > స్థాయిలో ఉన్నాయి.
> >
> >
> > ఈ భాషలను ఇలాగే ఇంగ్లీషు ఆధిపత్యానికి వదిలేస్తే యూరోపులో జర్మన్, ఫ్రెంచ్,
> > మొదలగు భాషలులా భారతదేశంలో కూడా తెంగ్లిష్, తంగ్లిష్, హింగ్లిష్, మంగ్లిష్,
> > మొదలయిన కొత్త భాషలు పుట్టుకొస్తాయని ఇంకొందరి మేధావుల ఆందోళన!
> >
> > ఈ ఇంగ్లీషు భాషయొక్క దండయాత్ర వల్ల తెలుగు వంటి భాషలకు తిని అరాయించుకోలేనన్ని
> > కొత్త పదాలు ఒక్కసారిగా అవసరం ఉన్నా లేకున్నా రావడం మాత్రమే కాకుండా భాషయొక్క
> > వ్యాకరణ స్వరూప భావాలే మారిపోతున్నాయి.
> >
> >
> >
> > మన వాళ్ళు "వాడుక భాషలో - చదువు" అంటూ గ్రాంథిక భాషను ఉరివేసి చంపేసి
> > ఇంకేముంది వాడుక భాష - తెలుగులోనే చదువుకుంటారు అంటూ చంకలెగరేశారు, కానీ ఏం
> > జరుగుతుంది? తెలుగునకు ఒక్కసారే తెలుంగులా ఉరివేయకుండా స్లోపాయిజన్ ఇచ్చి
> > చంపేస్తూ తెంగ్లిషును నెత్తిమీద పెట్టుకుంటున్నారు.
> >
> > సమాజంలో అట్టడుగున ఉన్నవారి ఉన్నతికి కాకపోతే ఇంకా విద్యావంతులు చ్దౌవుకోవడం
> > ఎందుకు? కాళ్ళకూ, కరములకూ శక్తినివ్వకపోతే కడుపుకు తిండి ఎందుకు దండగ కాకపోటే!
> >
> > అయితే- అంతేన?
> >
> > ఇంక ఏమీ చేయలేమా?
> >
> > ఒక్కరు అయితే ఏమీ చేయలేము, కానీ అందరమూ చేతులు కలిపితే ఏదైనా చెయ్యగలం.
> > ఒడికడుతున్న దీపాన్ని చూస్తూ ఏడవకుండా చేతులు అడ్డం పెట్టడమో, నూనెపోయడమో,
> > వత్తి ఎగవేయడమో చెయ్యాలి.
> >
> > ముందు అసలు ప్రస్తుత తెలుగు భాష పరిస్థితి ఏమిటో యుద్దప్రాతిపదికన అద్యయనం
> > చెయ్యాలి. వ్యాకరణం మొదలగు అన్ని విషయాలూ చక్కగా రికార్డు చెయ్యాలి. కవులు
> > కవితలు వ్రాయాలి, ప్రజలు మాట్లాడాలి, రచయతలు రాయాలి, వ్యాపారస్తులు తెలుగులో
> > వ్యాపారం చెయ్యాలి, తెలుగు వచ్చి ఉంటే భేషుగ్గా కాలరు ఎగరేసుకోని తిరగాలి.
> > ప్రతీ పనీ సగర్వంగా తెలుగులోనే చెయ్యాలి.
> >
> > ఇటువంటి ఓ చిన్న ప్రయత్నమే ఆధునిక కంప్యూటరు లక్ష్యం అయిన వెబ్2.0 లో
> > జరుగుతుంది. ప్రస్తుత ఇంటర్నెట్ విప్లవం అయిన బ్లాగులలో తెలుగు కూడా సగర్వంగా
> > తన ప్రస్థానం కొనసాగితుంది.
> >
> >
> > ఈ తెలుగు బ్లాగులు వ్రాసేవారిలో అన్ని రకాల వారూ ఉన్నారు, అన్ని ప్రాంతాల వారూ
> > ఉన్నారు, అన్ని రకాల ఆలోచనలు గలవారూ ఉన్నారు, రాజకియ విమర్శకులు, కవులు,
> > సాంకేతిక రంగ నిపుణులు, మేధావులు, కథల రచయితలు, ఫోటోప్రేమికులు, ప్రేమికులు,
> > ఒకరేమిటి ఇలా అన్ని రకాల వారూ ఉన్నారు.
> >
> > మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీరు తమలాగానే బ్లాగిం తెలుగులో
> > మొదలుపెట్టాలనుకునేవారికి ఓ చక్కని స్నేహితునిలా చక్కని సహాయ సహకారాలు
> > అందివ్వడంలో ముందున్నారు.
> >
> > బ్లాగుల కోసం చూడండి.
> >
> >
http://bloglines.com/public/telugublogs> >
> > తెలుగు బ్లాగు మొదలు పెట్టడానికి సహాయం కోసం చూడండి
> >
> >
http://oremuna.com/patrika/mediawiki/index.php?title=Telugublogging> >
> >
http://groups.google.com/group/telugublog - A group
> >
> > ఇంకా తెలుగు ఔత్సాహికుల వేదిక కోసం చూడండి
> >
> >
http://groups.yahoo.com/group/telugubrains > >
> >
> >
> >
> > --
> > ----
> > ధన్యవాదములు,
> > కిరణ్ కుమార్ చావా
> >
http://www.oremuna.com > >
http://flickr.com/photos/chavakiran> > naa sOdi
>
>
--~--~---------~--~----~------------~-------~--~----~
You received this message because you are subscribed to the Google Groups "telugublog" group.
To post to this group, send email to telugublog@googlegroups.com
To unsubscribe from this group, send email to telugublog-unsubscribe@googlegroups.com
For more options, visit this group at http://groups.google.com/group/telugublog
http://telugubloggers.blogspot.com
-~----------~----~----~----~------~----~------~--~---
4 Comments: